Bank Fraud Cases: రూ. 7 వేల కోట్ల బ్యాంక్ ఫ్రాడ్ కేసులు.. 169 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు

  • బ్యాంకు ఫ్రాడ్ కేసులపై ఉక్కుపాదం మోపుతున్న సీబీఐ
  • 35 ఫ్రాడ్ కేసులకు సంబంధించి సోదాలు జరుపుతున్నామన్న సీబీఐ అధికారి
  • బ్యాంకులు, వ్యక్తుల పేర్లను వెల్లడించడానికి నిరాకరణ

బ్యాంకు ఫ్రాడ్ కేసులపై సీబీఐ ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా రూ. 7 వేల కోట్ల విలువైన ఫ్రాడ్ కేసులకు సంబంధించి ఈరోజు దేశ వ్యాప్తంగా సోదాలను నిర్వహిస్తోంది. మొత్తం 169 ప్రాంతాల్లో దాడులు చేస్తోంది.

ఈ సందర్భంగా సీబీఐకి చెందిన ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ఢిల్లీ, గుజరాత్, చండీగఢ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్, దాద్రా మరియు నగర్ హవేలీలలో సోదాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రూ. 7 వేల కోట్లకు సంబంధించి 35 ఫ్రాడ్ కేసులు నమోదయ్యాయని చెప్పారు. అయితే బ్యాంకుల పేర్లు, వ్యక్తుల పేర్లను వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

More Telugu News