జగన్ నిర్ణయాలతో పెట్టుబడులు వచ్చే అవకాశమే లేదు: పురందేశ్వరి
- ఇసుక కొరతకు వరదలే కారణమని సాకులు చెబుతున్నారు
- ముందస్తుగా ఇసుకను ఎందుకు నిలువ చేయలేదు
- ప్రభుత్వ వైఖరితో అభివృద్ధి కుంటుపడుతోంది
పాత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఐదు నెలలైనా... కొత్త విధానాన్ని తీసుకురాలేకపోయారని పురందేశ్వరి విమర్శించారు. రివర్స్ టెండరింగ్, పీపీఏల రద్దు, ఇసుక సమస్యల కారణంగా రాష్ట్ర అభివృద్ధి కుంటుపడుతోందని అన్నారు. జగన్ తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం లేదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు.