Maharashtra: రూ.40 వేలు దొరికితే తిరిగి తెచ్చిచ్చిన నిరుపేద!

  • మహారాష్ట్రలో ఘటన 
  • చేసిన సాయానికి రూ.వెయ్యి ఇవ్వబోగా తిరస్కరణ
  • బస్సు చార్జీకి రూ.7 మాత్రమే ఇవ్వాలని కోరిన వ్యక్తి 

ఆయన వద్ద డబ్బు లేదు.. కానీ, నిజాయతీ మాత్రం శరీరంలోని అణువణువూ జీర్ణించుకుపోయింది. పరాయి సొమ్ముపై ఆవగింజంత ఆశ కూడా లేదు. ఆయన జేబులో కేవలం రూ.3 మాత్రమే ఉన్నాయి. అటువంటి నిరుపేద తను. అయినప్పటికీ, నిజాయతీని చాటుకున్నాడు.

మహారాష్ట్రలో సతారా పరిధిలోని ధహివాడీ బస్టాండ్‌లో జగ్దాలే (54) అనే వ్యక్తికి రూ.40 వేల కట్ట దొరకగా.. ఆ డబ్బు ఎవరిదన్న విషయంపై ఆరా తీసి మరీ పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి అప్పగించాడు. భార్యకు ఆపరేషన్ చేయించేందుకు ఓ వ్యక్తి డబ్బు తీసుకెళుతూ బస్టాండ్‌లో పారేసుకున్నాడు. ఆ డబ్బు జగ్దాలే తెచ్చి ఇవ్వడంతో ఆ వ్యక్తి ప్రాణాలు లేచొచ్చినట్లయింది.

జగ్దాలే చేసిన సాయానికి ఆయన వెయ్యి రూపాయలు ఇవ్వబోగా ఆయన తిరస్కరించాడు. తన వద్ద రూ.3 ఉన్నాయని, అవి బస్సు చార్జీకి సరిపోవని రూ.7 ఇవ్వాలని కోరాడు. చివరకు రూ.7 మాత్రమే తీసుకొని వెళ్లిపోయాడు. ఈ విషయాన్ని అమెరికాలో ఉంటున్న రాహుల్‌ బార్జే అనే వ్యక్తి తెలుసుకొని, రూ. 5 లక్షల నగదును జగ్దాలేకి ఇస్తానని చెప్పాడు. ఆ నగదుని కూడా జగ్దాలే వద్దని చెప్పాడు.

More Telugu News