ఈ నెల 7న నీరవ్ మోదీ కార్ల వేలం
- 13 కార్లను వేలానికి ఉంచనున్న ఈడీ
- వాటిల్లో ఒక కారు ధర రూ.2 కోట్లు
- త్వరలో మరిన్ని వస్తువుల వేలం
ఈ నెల 7న వీటి వేలం ఉంటుందని ప్రకటన వచ్చింది. విదేశాలకు పారిపోయిన నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అక్కడి వాండ్స్ వర్త్ జైల్లో అతడు ఉంటున్నాడు. బెయిల్ కోసం అతడు ఇటీవల దరఖాస్తు చేసుకున్నాడు. దీనిపై కోర్టు ఈ నెల 6న విచారణ చేపట్టనుంది. అతడికి చెందిన విలువైన వాచ్ లు, పెయింటింగ్స్ ను కూడా త్వరలో వేలం వేయనున్నారు.