Jana Sena: విశాఖలో రేపు జనసేన లాంగ్‌మార్చ్‌.. అనుమతినిచ్చిన పోలీసులు

  • ట్విట్టర్‌లో వెల్లడించిన పవన్‌ కల్యాణ్‌
  • ఇసుక సంక్షోభంపై ’ఛలో విశాఖపట్నం' కార్యక్రమం
  • 2.5 కిలోమీటర్ల మేర సాగనున్న యాత్ర

రాష్ట్రంలో ఇసుక కొరత కారణంగా భనవ నిర్మాణ కార్మికులు, అనుబంధ రంగాల కార్మికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎత్తిచూపే లక్ష్యంతో జనసేన రేపు విశాఖలో తలపెట్టిన ‘చలో విశాఖపట్నం’ లాంగ్‌ మార్చ్‌కు పోలీసులు అనుమతిని ఇచ్చారు. ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ స్వయంగా ట్విట్టర్‌లో తెలియజేశారు. కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు, మద్దతుదారులు రాకుండా అడ్డుకునేందుకు కొందరు కావాలని లాంగ్‌ మార్చ్‌కు అనుమతిలేదంటూ ప్రచారం చేస్తున్నారని, ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు.

అనుకున్న విధంగా, అనుకున్న సమయానికి విశాఖలో మద్దిలపాలెం జంక్షన్‌లోని తెలుగుతల్లి విగ్రహం  నుంచి జీవీఎంసీ ఎదుట ఉన్న గాంధీ విగ్రహం వరకు రెండున్నర కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని 35 లక్షల మంది కార్మికుల గొంతు వినిపిస్తామన్నారు. లాంగ్‌ మార్చ్‌ యథావిధిగా జరుగుతుందని, కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని కోరారు.

More Telugu News