USA: అమెరికాలో ఆగని కార్చిచ్చు... వేగంగా వ్యాపిస్తున్న దావానలం

  • నివాస ప్రాంతాలకు వ్యాపించిన మంటలు
  • వందలాది ఇళ్లు అగ్నికి ఆహుతి
  • మంటలను ఆర్పేందుకు శ్రమిస్తున్న అగ్నిమాపకదళం
కొన్ని రోజుల క్రితం అమెరికా అడవుల్లో చెలరేగిన కార్చిచ్చు ఇంకా చల్లారలేదు. మంటలను అదుపు చేయడానికి అగ్నిమాపక విభాగం 500 ఫైరింజన్లతో తీవ్రంగా శ్రమిస్తోంది. కాలిఫోర్నియాలోని శాన్ బెర్నర్డినో అడవుల్లో ప్రారంభమైన కార్చిచ్చు నివాస ప్రాంతంలోకి విస్తరించింది. వందలాది ఇళ్లు మంటల ప్రభావానికి లోనయ్యాయి. కొన్ని ఇళ్లు పూర్తిగా కాలిపోగా మరికొన్ని పాక్షికంగా దెబ్బతిన్నాయి.  ప్రజలనుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మంటలను 50శాతం వరకు నియంత్రించామని వారు చెబుతున్నారు. మరోవైపు చాలా మంది ప్రజలు తమ ఇళ్లను విడిచి ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు.  
USA
Wildfire
California

More Telugu News