చట్టం ముందు అందరూ సమానమే అనే విషయం కోర్టు తీర్పుతో వెల్లడైంది: కన్నా లక్ష్మీనారాయణ
- వ్యక్తిగత హోదాలోనే జగన్ పై కేసు నమోదైంది
- జగన్ 5 నెలల పాలనలో ప్రజలు భయపడుతూ బతికారు
- ఇసుక కొరతను ప్రభుత్వమే కృత్రిమంగా సృష్టించింది
ఇసుక కొరతను ప్రభుత్వమే కృత్రిమంగా సృష్టించిందని కన్నా ఆరోపించారు. లక్షలాది భవన నిర్మాణ కార్మికుల కష్టాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు ఇది పెద్ద సమస్యగా కనిపిస్తున్నా... రాష్ట్ర మంత్రులకు మాత్రం కనిపించడం లేదని అన్నారు. సమస్యలపై పోరాటం చేస్తున్నవారిపై దాడులు చేయడం సరైంది కాదని చెప్పారు. జనసేన చేపడుతున్న లాంగ్ మార్చ్ కు తమ సంఘీభావం ఉంటుందని... కానీ, అందులో పాల్గొనడం మాత్రం ఉండదని తెలిపారు. ఈ నెల 4న ఇసుక సత్యాగ్రహాన్ని చేపట్టబోతున్నామని చెప్పారు.