America: లాస్‌ఏంజిల్స్‌లోని కార్చిచ్చు ఫొటోలను తీసిన అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగామి!

  • గడచిన వారం రోజులుగా రగులుతున్న అగ్నిజ్వాలలు
  • ఇప్పటికే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిన 10వేల మంది
  • బాధితులుగా మిగిలిన మరో లక్షన్నర మంది

వారం రోజుల క్రితం అమెరికాలోని కాలిఫోర్నియా, పశ్చిమ లాస్‌ఏంజెల్స్‌లోని అటవీ ప్రాంతాల్లో మొదలైన కార్చిచ్చు ప్రమాదకరంగా విస్తరిస్తుండడంతో అగ్రరాజ్యం అందోళన చెందుతోంది. ఈ నెల 23న ఈ కార్చిచ్చు మొదలైంది. హాలీవుడ్‌ నటులు సహా దాదాపు 10 వేల మందిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇంకా మరో లక్షన్నర మంది వరకు బాధితులు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కార్చిచ్చు విస్తరణకు సంబంధించి శాటిలైట్‌ తీసిన ఫొటోల ద్వారా మంటల వ్యాప్తి వేగాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం స్పేస్‌ స్టేషన్‌లో ఉన్న అమెరికా అంతరిక్ష సంస్థకు చెందిన వ్యోమగామి అండ్రూ మోర్గాన్‌ కార్చిచ్చుకు సంబంధించిన ఫొటోలను తీసి ట్విట్టర్‌లో షేర్‌ చేశాడు. ‘అంతరిక్షం నుంచి కాలిఫోర్నియా అడవుల్లో చెలరేగిన మంటల ఫొటోలు తీశాను. ఈ ఘటనలో ఇళ్లు కోల్పోయిన వారి గురించి, వాళ్లను కాపాడిన సాహసవంతుల గురించి ఆలోచిస్తున్నా' అంటూ ట్వీట్ చేశాడు.  

More Telugu News