Abu Bakar: అల్ బాగ్దాదీ అండర్ వేర్ ను దొంగిలించి, అమెరికన్ సైన్యానికి ఇచ్చిన సిరియా ఏజంట్... ఎందుకో తెలుసా?

  • సిరియన్ దళాల్లో పనిచేస్తూ అండర్ కవర్ ఏజంట్ గా ఉగ్రవాదుల్లో
  • అండర్ వేర్ కు డీఎన్ఏ పరీక్షలు చేసిన యూఎస్ ఆర్మీ
  • ఆపై అక్కడున్నది బాగ్దాదీయేనని తేల్చుకుని దాడులు

అమెరికన్ సైన్యం దాడులు చేసి ఐసిస్ అధినేత అబూ బకర్ అల్ బాగ్దాదీని హతమార్చనున్నట్టు సిరియన్ కుర్దూ సైన్యాధికారులకు ముందే తెలుసని సమాచారం. సిరియన్ కుర్దూ దళాల్లో పనిచేస్తూ, ఐసిస్ ఉగ్రవాదిగా అండర్ కవర్ ఏజంట్ గా ఉన్న ఓ వ్యక్తి, ఈ దాడికి ముందు అల్ బాగ్దాదీకి చెందిన రెండు అండర్ వేర్ లను దొంగిలించి తీసుకెళ్లి యూఎస్ సైన్యానికి అప్పగించాడు. దాని నుంచి డీఎన్ఏ పరీక్షలు చేసి, అక్కడ ఉన్నది బాగ్దాదీయేనా అన్న విషయాన్ని నిర్ధారించవచ్చని యూఎస్ అధికారులు భావించారని తెలుస్తోంది.

ఐసిస్ జరిపిన దాడులు, ఆపై బాగ్దాదీ హతంపై సిరియన్ డెమోక్రాటిక్ ఫోర్సెస్ సీనియర్ సలహాదారు పొలాట్ కాన్, వివరాలు అందించారు. మే 15 నుంచి తాము సీఐఏతో కలిసి పని చేస్తూ, అల్ బాగ్దాదీ కదలికలపై నిఘా ఉంచామని, ఆయన్ను అత్యంత దగ్గరగా పరిశీలిస్తూ వచ్చామని ఆయన అన్నారు.

అతను ఎక్కువ కాలం ఒకే ఇంట్లో ఉండడని, అందువల్లే ఆపరేషన్ పూర్తయ్యేందుకు నాలుగు నెలలకు పైగా సమయం పట్టిందని అన్నారు. బాగ్దాదీ ఓ భవనంలో వున్నాడని కచ్చితంగా తెలుసుకున్న తరువాతనే దాడులు జరిపామని అన్నారు. తమ ఏజంట్ తెచ్చిన అండర్ వేర్ లను పరిశీలించిన తరువాత ఆ ఇంట్లో ఉన్నది బాగ్దాదీయేనని తేలిందని అన్నారు.

More Telugu News