Bigg Boss: బిగ్ బాస్ లో గెలిచేది ఎవరో గట్టిగా చెబుతున్న వితిక!

షార్ట్స్‌లో చూడండి
తుది దశకు చేరుకున్న టాలీవుడ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3లో విజయం సాధించబోయేది తన భర్తేనని వరుణ్ సందేశ్ భార్య వితికా షేరు బల్లగుద్ది మరీ చెబుతోంది. రెండు వారాల క్రితం వరకూ భర్తతో హౌస్ లోనే కంటెస్టెంట్ గా ఉన్న వితిక, ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. బయటకు వచ్చిన తరువాత, తనను కలిసిన మీడియాతో మాట్లాడిన ఆమె, హౌస్ లో ఉన్న సమయంలో తనకు ఓపిక విలువ తెలిసి వచ్చిందని చెప్పింది. ఏ టాస్క్ ఇచ్చినా, తనకంటే వరుణ్ ఎంతో బాగా ఆడాడని వ్యాఖ్యానించింది.

వరుణ్ సోలోగా ఉంటే మరింత బాగా ఆడతాడని తాను బయటకు వచ్చిన తరువాత చాలా మంది చెప్పారని, అందువల్ల తాను ఎలిమినేట్ అయినందుకు బాధపడటం లేదని అన్నారు. ఒకరి సహాయం లేకుండా, గూగుల్ ను చూడకుండా సింపుల్ గా బతకవచ్చని తనకు హౌస్ లో ఉన్న సమయంలో తెలిసిందని వితిక చెప్పుకొచ్చింది. పలు టాస్క్ లను మైండ్ తో ఆడటంతో విజ్ఞానం పెరిగిందని చెప్పింది.

హౌస్ లో వంటలు చేయడంలో తానే బెస్టని, ఆరు వారాల పాటు కిచెన్ కెప్టెన్ గా ఉన్నానని గుర్తు చేసిన వితిక, ఫైనల్ లో వరుణ్ గెలిస్తే, లభించే రూ. 50 లక్షలను భద్రంగా దాచుకుంటామని చెప్పింది. పెళ్లి తరువాత మూడు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డామని, ఇప్పుడు డబ్బులు వస్తే, దాన్ని ఫిక్సెడ్ చేసుకుంటామని వ్యాఖ్యానించింది. ఇక ఫైనల్ లో తన భర్త వరుణ్ తో పాటు శ్రీముఖి, రాహుల్ ఉండవచ్చని భావిస్తున్నానని వితిక అంచనా వేసింది. బిగ్ బాస్ -3 లో తాను హౌస్ లో ఉన్న సమయంలో మొత్తం 250 డ్రస్ లను మార్చానని, రోజుకు మూడు డ్రస్ లను వేసుకున్నానని చెప్పింది.
Go Back to Shorts
Bigg Boss
Vithika
Varun
Finalists

More Telugu News