DK Shivakumar: కానుకల ఖర్చు నా వ్యక్తిగత ఖాతాకు చెందినవే!: కాంగ్రెస్ నేత డీకే శివకుమార్

  • ప్రభుత్వ నిధులు ఉపయోగించలేదు
  • ఆరోపణలు చేసిన వారికి కూడా సెల్ ఫోన్లు బహూకరించాను
  • వారికీ ఈడీ నోటీసులు ఇవ్వాలి

కానుకల విషయంలో నేను తప్పుచేశానంటూ నాకు ఈడీ నోటీసులు ఇవ్వడం సరికాదని కర్ణాటక మాజీ మంత్రి కాంగ్రెస్ నేత డీకే శివకుమార్ అన్నారు. స్నేహితులు, బంధువులు, పార్లమెంట్ సభ్యులు ఎందరికో నేను మొబైల్ ఫోన్లు కానుకగా ఇచ్చాను. వాటి కొనుగోలుకు అయిన ఖర్చు వ్యక్తిగతంగా భరించానని ఆయన మీడియాకు చెప్పారు. 

ఇటీవల మనీ ల్యాండరింగ్ కేసులో శివకుమార్ ను ఇటీవల ఈడీ అరెస్టు చేసింది. అనంతరం ఆయన ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పొందారు. ఈరోజు పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ నేను రాష్ట్ర మంత్రిగా ఉన్న సమయంలో ఎంతో మంది నన్ను కలుస్తుండేవారు. వారిలో స్నేహితులు, చుట్టాలు, ఎంపీలు తదితరులున్నారు. కొంతమంది కొత్త మోడల్స్ మొబైల్ ఫోన్లు కావాలంటే కొనిచ్చాను. వాటికయ్యే ఖర్చు నా వ్యక్తి గత ఖాతానుంచే భరించా. ప్రభుత్వ నిధులు ఉపయోగించలేదు.

నాపై ఆరోపణలు చేసిన వారికి సైతం ఫోన్లు కానుకగా ఇచ్చాను కదా. మరి వారికి ఈడీ నోటీసులు ఇవ్వలేదెందుకు ? రూ.50వేల విలువచేసే ఫోన్లు ఇస్తే నాకు నోటీసులిస్తారా? గత ఏడాది నుంచి ఈ విషయం వివరించడానికి ఎదురుచూస్తున్నా, ఇప్పుడు అవకాశంవచ్చింది వెల్లడిస్తున్నా’ అని అన్నారు.

More Telugu News