baghdadi: ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బాగ్దాదీ మృతి వెనక ఆమె!

  • అమెరికా దళాలకు సహకరించిన ఉగ్రవాది భార్య 
  • 2016లోనే అబూబకర్ ఇంటిని గుర్తించి నిఘా సంస్థలకు సమాచారం
  • దళాలు చుట్టుముట్టడంతో పిల్లలతో కలిసి బగ్దాదీ ఆత్మహత్య

ఐసిస్ చీఫ్ అబూబకర్ అల్ బగ్దాదీ మృతి వెనక ఓ మహిళ ఉన్న విషయం బయటపడింది. ఆమె ఇచ్చిన సమాచారం వల్లనే బగ్దాదీపై అమెరికా దళాలు బాంబుల వర్షం కురిపించగలిగాయి. చివరికి తప్పించుకోలేని పరిస్థితుల్లో బగ్దాదీ తనను తాను పేల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఐసిస్‌లో కీలక ఉగ్రవాది అయిన నిస్రిన్ ఇబ్రహీం భర్త 2015 మేలో ప్రాణాలు కోల్పోయాడు. తూర్పు సిరియాలోని  అల్-ఒమర్ చమురు క్షేత్రంపై జరిగిన దాడిలో అతడు మృతి చెందాడు. ఆ తర్వాత నిస్రిన్ పోలీసులకు చిక్కింది.

పోలీసుల అదుపులో ఉన్న ఆమె ఐసిస్‌కు సంబంధించిన కీలక విషయాలను  అమెరికా నిఘా సంస్థ సీఐఏ, కుర్దిష్ ఇంటెలిజెన్స్ సంస్థలకు అందించేందుకు ముందుకొచ్చింది. ఫిబ్రవరి 2016లో ఇరాక్‌లోని మోసుల్‌లో బాగ్దాదీ ఇంటిని గుర్తుపట్టిన ఆమె ఆ విషయాన్ని నిఘా సంస్థలకు చేరవేసింది. అయితే అప్పట్లో అమెరికా వైమానిక దాడులకు ఆదేశాలు ఇవ్వలేదు. తాజాగా, జరిపిన దాడిలో బగ్దాదీ హతమయ్యాడు. వాయవ్య సిరియాలోని ఇడ్లిబ్‌లో జరిగిందీ దాడి. అమెరికా దళాలకు దొరికిపోవడానికి ఇష్టపడని బగ్దాదీ పేలుడు పదార్థాలు నింపుకుని తన ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకున్నాడు.

More Telugu News