Syria: అమెరికా దాడిలో సిరియాలో 9 మంది ఉగ్రవాదులు మృతి

  • సిరియా వాయవ్య ప్రాంతంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ లో అమెరికా సైన్యం దాడి
  • బారిషా గ్రామంలో తొమ్మిది మంది మృతి 
  • ఆ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఉగ్రవాదులు ఉంటారు
  • వివరించిన బ్రిటన్ సంస్థ

ఉగ్ర సంస్థ 'ఐసిస్' అగ్రనేత అబూ బకర్ అల్ బాగ్దాదీ హతమయ్యాడని మీడియాలో కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిపై 'భారీ సంఘటన జరిగింది' అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేయడంతో ఈ విషయం చర్చనీయాశమైంది. ఐసిస్ స్థావరాలపై అమెరికా చేసిన దాడిపై బిట్రన్ కు చెందిన ఓ మానవ హక్కుల సంస్థ పలు వివరాలు తెలిపింది.

సిరియా వాయవ్య ప్రాంతంలోని ఇడ్లిబ్ ప్రావిన్స్ లో ఉన్న బారిషా గ్రామంలో హెలికాప్టర్ నుంచి సైనికులు జరిపిన కాల్పుల్లో తొమ్మిది మంది మృతి చెందారని పేర్కొంది. ఆ ప్రాంతంలో ఇస్లామిక్ స్టేట్ కు చెందిన ఉగ్రవాదులు ఉంటారని వివరించింది. బారిషా శివారు ప్రాంతంలో ఉన్న ఓ ఇల్లు, కారుపై సైనికులు ఈ దాడి చేశారని పేర్కొంది.

కాగా, అమెరికా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్ లో ఇదే ప్రాంతంలో ఐసిస్ అగ్రనేత అబూ బకర్ అల్ బాగ్దాదీని అమెరికా సైన్యం హతమార్చిందని కథనాలు వస్తున్నాయి. దీనిపై అమెరికా అధికారిక ప్రకటన చేయలేదు. 

More Telugu News