సిద్ధరామయ్యకు కర్ణాటక సీఎం యడియూరప్ప స్ట్రాంగ్ వార్నింగ్
- వీరసావర్కర్‌కు భారతరత్న ఇస్తామన్న బీజేపీ వ్యాఖ్యలపై మండిపడిన సిద్ధరామయ్య
- ఘాటుగా బదులిచ్చిన ముఖ్యమంత్రి
- వైఖరి మార్చుకోకుంటే గుణపాఠం తప్పదని హెచ్చరిక
అలాగే, స్పీకర్‌ను సిద్ధరామయ్య ఏకవచనంతో సంబోధించడంపైనా యడియూరప్ప మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి స్పీకర్‌ను ఏకవచనంతో సంబోధించడం సరికాదని, క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సిద్ధరామయ్యపై శాసనసభలో సభాహక్కుల నోటీసు ప్రవేశపెడతామని తేల్చి చెప్పారు. సిద్ధరామయ్య ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని యడియూరప్ప హితవు పలికారు. ఆయన తన వైఖరి మార్చుకోకుంటే ప్రజలే గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.