Huzurnagar: హుజూర్ నగర్ లో భారీ వర్షం.. కేసీఆర్ సభపై అనుమానాలు!

  • హూజూర్ నగర్ లో నేడు టీఆర్ఎస్ కృతజ్ఞత సభ
  • హైదరాబాద్ నుంచి భారీ కాన్వాయ్ తో తరలివెళ్లిన కేసీఆర్
  • వర్షం కారణంగా సభ జరుగుతుందా? లేదా? అనే ఆందోళన
హుజూర్ నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఈ రోజు హుజూర్ నగర్ లో కృతజ్ఞత సభను టీఆర్ఎస్ నిర్వహిస్తోంది. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభంకానుంది. ఈ సభ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాదు నుంచి హుజూర్ నగర్ కు రోడ్డు మార్గాన భారీ కాన్వాయ్ తో తరలివెళ్లారు. అయితే, హుజూర్ నగర్ లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో, సభ జరుగుతుందా? లేదా? అని పార్టీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. పోలింగ్ కు ముందు హుజూర్ నగర్ లో కేసీఆర్ ప్రచారానికి కూడా వర్షం అడ్డు తగిలిన సంగతి తెలిసిందే. వర్షం కారణంగా కేసీఆర్ ప్రచారాన్ని రద్దు చేసుకున్నారు. ఈ రోజు మరోసారి అదే సీన్ రిపీట్ అవుతుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
Huzurnagar
KCR
Rain
TRS

More Telugu News