ఈస్ట్‌కోస్టు రైల్వే ఆధ్వర్యంలో 20 ప్రత్యేక రైళ్లు
- రద్దీ మార్గాల్లో నడపాలని అధికారుల నిర్ణయం
- ఢిల్లీ, సికింద్రాబాద్, అలహాబాద్ వంటి ప్రధాన నగరాలకు
- ఐదు లక్షల మందికి అందుబాటులోకి రానున్న అదనపు బెర్తులు
ముఖ్యంగా దేశరాజధాని ఢిల్లీ, సికింద్రాబాద్, బెంగళూరు, హౌరా, చెన్నై, అలహాబాద్, పాట్నా, భాగల్పూర్ నగరాలకు ఎక్కువ రద్దీ ఉంటుందని, ఈ రూట్లపై దృష్టిసారిస్తున్నామని అధికారులు తెలిపారు. దీంతోపాటు సాధారణ రైళ్లలోనూ బోగీల సంఖ్యను పెంచాలని నిర్ణయించామని రైల్వే అధికారులు చెప్పారు.
పండగల సందర్భంగా రాకపోకలు సాగించే ప్రయాణికులు, సాధారణ రైళ్లలో వెయిటింగ్ లిస్టు వస్తే ప్రత్యేక రైళ్లలో టికెట్లు తీసుకోవచ్చని అధికారులు సూచించారు.