ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చలకు కేసీఆర్ ఓకే.. నేడు చర్చలు?
- ఆర్టీసీ సమ్మెపై నాలుగు గంటలపాటు సీఎం సమీక్ష
- నేడు కార్మిక సంఘాలతో భేటీ కానున్న ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ
- తమకు సమాచారం లేదన్న అశ్వత్థామరెడ్డి
నేటి ఉదయం కార్మిక సంఘాలకు చర్చలకు సంబంధించిన సమాచారం ఇవ్వనున్నారు. అయితే, చర్చలపై ప్రభుత్వం నుంచి అధికారికంగా ఎటువంటి ప్రకటన విడుదల కాలేదు. చర్చల విషయమై ప్రభుత్వం నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు.