ఇసుక తరలింపు వ్యవహారంపై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన ఎల్ అండ్ టీ

  • ఇసుక స్వాధీనానికి మెమోలు జారీ చేసిన ప్రభుత్వం  
  • దీన్ని సవాల్ చేస్తూ కోర్టులో ఎల్ అండ్ టీ పిటిషన్
  • 4 వారాల పాటు మెమోలను నిలిపివేస్తూ కోర్టు ఉత్తర్వులు   
ఇసుక తరలింపు వ్యవహారంపై ఎల్ అండ్ టీ సంస్థ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. అమరావతిలోని ఎల్ అండ్ టీ స్టాక్ పాయింట్ నుంచి ఇసుక తరలింపును సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇసుకను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం జారీ చేసిన మెమోలను నాలుగు వారాల పాటు నిలిపివేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది. ఎల్ అండ్ టీ స్టాక్ యార్డులో ఎంత ఇసుక ఉందో కంపెనీ ప్రతినిధుల సమక్షంలో లెక్కించాలని ఆదేశించింది.
Go Back to Shorts
Amaravathi
sand
L&T
Ap
High Court

More Telugu News