Rana: రానా కొత్త వ్యాపారం... క్రీడారంగంలో పెట్టుబడులు!

  • ఐఎస్ఎల్ లో ప్రవేశించిన రానా
  • హైదరాబాద్ ఎఫ్.సితో చేతులు కలిపిన భల్లాలదేవుడు
  • ట్విట్టర్ లో వెల్లడించిన హైదరాబాద్ ఎఫ్.సి యాజమాన్యం

బాహుబలి చిత్రాల ద్వారా హీరో ప్రభాస్ తో సమానంగా పాప్యులారిటీ అందుకున్న నటుడు దగ్గుబాటి రానా. భల్లాలదేవుడు పాత్రతో ప్రేక్షకులకు బాగా దగ్గరైన రానా ఇప్పుడు కొత్త రంగంలో అడుగుపెట్టాడు. ఇండియన్ సాకర్ లీగ్ (ఐఎస్ఎల్) లో రానా హైదరాబాద్ ఫ్రాంచైజీలో పెట్టుబడి పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ నుంచి చిరంజీవి కేరళ బ్లాస్టర్స్ జట్టులో పెట్టుబడి పెట్టారు. తాజాగా రానా కూడా ఐఎస్ఎల్ లో ప్రవేశించినట్టయింది.

హైదరాబాద్ ఎఫ్.సి కుటుంబంలో రానా కూడా భాగం అయ్యాడని మేనేజ్ మెంట్ ఓ ట్వీట్ లో వెల్లడించింది. హైదరాబాద్ ఫుట్ బాల్ రంగానికి పునర్వైభవం వస్తుందని భావిస్తున్నామని, ఈ సందర్భంగా రానాకు హార్దిక స్వాగతం పలుకుతున్నామని హైదరాబాద్ ఎఫ్.సి యాజమాన్యం పేర్కొంది.

More Telugu News