Huzurunagar: ఆ గెలుపు గెలుపేనా?: జీవన్ రెడ్డి

  • రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోంది
  • ఆర్టీసీని ప్రైవేటుపరం చేయాలని ప్రభుత్వం కుట్ర 
  • గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలి

హుజూర్ నగర్ లో టీఆర్ ఎస్ గెలుపు గెలుపేకాదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులను కలిసిన కాంగ్రెస్ నేతలు సమ్మెకు సంఘీభావం ప్రకటించారు.

 ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ, ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పూర్తి బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందన్నారు. ఆర్టీసీని ప్రవేటుపరం చేసేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ కుట్రను నిరసిస్తూ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారన్నారు. ఆర్టీసీలో 10 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని.. తెలంగాణ ఏర్పడ్డాక ఒక్క డ్రైవర్ పోస్టును కూడా భర్తీ చేయలేదని ఆయన ఎత్తిచూపారు. టీఆర్ఎస్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

More Telugu News