Ramgopal Varma: స్టన్నింగ్ స్టిల్స్... 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు'లో జగన్ గా నటుడు అజ్మల్!

  • వర్మ దర్శకత్వంలో చిత్రం
  • అజ్మల్ ఫస్ట్ లుక్ విడుదల
  • వైరల్ అవుతున్న ఫోటోలు
సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఆంధ్రప్రదేశ్ తాజా రాజకీయాల నేపథ్యంగా 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' పేరిట ఓ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పలువురు ప్రస్తుత రాజకీయ నాయకుల పాత్రలు కనిపించనున్నాయి. ఈ క్రమంలో ఇందులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాత్రను ఎవరు పోషించారా? అన్న అభిమానుల ప్రశ్నలకు తాజాగా సమాధానం లభించింది. జగన్ పాత్రలో నటుడు అజ్మల్ కనిపించనున్నాడు. అతని స్టిల్స్ సోషల్ మీడియాలో విడుదలై వైరల్ అవుతున్నాయి. అచ్చం జగన్ మాదిరిగానే నమస్కారం పెడుతున్న అజ్మల్ స్టిల్ ను చిత్ర పీఆర్ఓ రమేశ్ బాలా తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. 
Ramgopal Varma
Kamma Rajyamlo Kadapa Reddlu
Azmal
Jagan

More Telugu News