Babita Phogat: రాజకీయాల్లో కూడా ప్రత్యర్థులను చిత్తు చేసిన రెజ్లర్ బబితా ఫొగట్

  • చాఖ్రీ దాద్రి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన బబిత
  • బీజేపీ తరపున రంగంలోకి దిగిన ప్రముఖ రెజ్లర్
  • ప్రత్యర్థులకు అందనంత ఆధిక్యతలో బబిత
అసెంబ్లీ ఎన్నికల్లో ప్రముఖ రెజ్లర్ బబితా ఫొగట్ గెలుపు దిశగా దూసుకెళ్తున్నారు. హర్యానాలోని చాఖ్రీ దాద్రి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె... ప్రత్యర్థుల కంటే ముందంజలో ఉన్నారు. కాసేపటి క్రితం కౌంటింగ్ కేంద్రానికి చేరుకున్న ఆమెకు... బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడుతూ, ప్రజలు తనను ఆశీర్వదించారని చెప్పారు. ప్రజలపై తనకు నమ్మకం ఉందని... వారి ప్రేమాభిమానాలే తనను ముందుకు సాగేలా చేస్తున్నాయని తెలిపారు. 2014, 2018 కామన్ వెల్త్ గేమ్స్ లో ఆరు బంగారు పతకాలను సాధించారు. గత ఏడాది బీజేపీలో చేరారు.

Babita Phogat
Haryana
Elections
BJP

More Telugu News