CPCB: కాలుష్యభరిత నగరాల్లో వారణాసి ఫస్ట్.. 49వ స్థానంలో తిరుపతి

  • 500 నగరాలకు ఏఐక్యూ ర్యాంకులు ఇచ్చిన కాలుష్య నియంత్రణ మండలి
  • జాబితాలో ఏపీలోని ఐదు నగరాలు
  • హైదరాబాద్‌కు 91వ స్థానం

అత్యంత కాలుష్యభరితమైన నగరాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రమైన వారణాసి (కాశీ) అగ్రస్థానంలో నిలవగా, కలియుగ వైకుంఠంగా పేరొందిన తిరుపతి 49వ స్థానంలో నిలిచింది. హైదరాబాద్ 91వ స్థానంలో నిలవగా విజయవాడ 36వ స్థానంలో నిలిచింది. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ఆధారంగా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ) దేశంలోని 500 నగరాలకు ర్యాంకులు ఇచ్చింది.

సీపీసీబీ ఇచ్చిన ఏక్యూఐ ర్యాంకుల్లో వారణాసి అగ్రస్థానంలో ఉండగా ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతి 32, విజయవాడ 36, రాజమండ్రి 46, తిరుపతి 49, విశాఖపట్టణం 55, తెలంగాణ రాజధాని హైదరాబాద్ 91 స్థానాల్లో నిలిచాయి. కర్ణాటక రాజధాని బెంగళూరు 34, మహారాష్ట్ర రాజధాని ముంబై 109, ఢిల్లీ 196 స్థానాల్లో ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని లక్నో 269, ముజఫర్‌నగర్ 266, మొరాదాబాద్ 256 స్థానాలను దక్కించుకున్నాయి.

More Telugu News