నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు... బండ్ల గణేష్

24-10-2019 Thu 09:03
  • అరెస్ట్ చేస్తే నేనే మీకు చెబుతా
  • చట్టంపై గౌరవం ఉంది
  • విచారణ కోసం పిలిచారంతే: గణేశ్

కడప జిల్లాలో ఓ వ్యాపారి నుంచి అప్పు తీసుకుని, తిరిగి చెల్లించలేదన్న కారణంగా నిన్న రాత్రి ప్రముఖ సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ ను పోలీసులు అరెస్ట్ చేశారన్న సంగతి తెలిసిందే. అయితే, దీనిపై ఈ ఉదయం 7.40 గంటల ప్రాంతంలో స్పందించిన బండ్ల గణేశ్, తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ పెట్టిన ఆయన, "నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు. విచారణ కోసం పిలవడం జరిగింది. నన్ను అరెస్టు చేస్తే నేను మీకు తెలియజేస్తాను... మీ బండ్ల గణేష్" అని ఆయన ట్వీట్ చేశారు.