కత్తితో పొడిచినా చావలేదని తుపాకితో కాల్చారు.. హిందూ సమాజ్ పార్టీ నేత పోస్టుమార్టం నివేదిక వెల్లడి!
- గత శుక్రవారం పార్టీ కార్యాలయంలోనే హత్య
- మిఠాయిలు ఇచ్చేందుకు వచ్చి కత్తితో నరికి చంపిన దుండగులు
- ఇప్పటి వరకు ఆరుగురి అరెస్ట్
ఈ కేసులో నిన్న ఉదయం సూరత్‌కు చెందిన అష్ఫాక్ హుస్సేన్, మోయిదీన్ పఠాన్‌లను అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటి వరకు అరెస్ట్ అయినవారి సంఖ్య ఆరుకు చేరింది. హత్యకు ముందు రోజు రాత్రి లక్నోలో తమ అసలు పేర్లతో హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్న నిందితులు, హత్య అనంతరం దుస్తులు, హత్యకు ఉపయోగించిన కత్తిని హోటల్ గదిలోనే ఉంచి సూరత్‌కు వెళ్లిపోయినట్టు పోలీసులు తెలిపారు.