మోదీపై దాడి చేస్తానంటూ పాక్ గాయకురాలు వ్యాఖ్యలు.. సూసైడ్ జాకెట్ ధరించి ఫొటో పోస్ట్!
- మోదీని హిట్లర్ గా అభివర్ణించిన వైనం
- గతంలోనూ పలుసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు
- నెటిజన్ల విమర్శలు
పాక్ ఉగ్రవాదాన్ని పోత్సహిస్తుందనడానికి రబీ పిర్జాదా తీరే నిదర్శనమని నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇలా సూసైడ్ జాకెట్ ధరించడం పాకిస్థాన్ సంప్రదాయ వస్త్రధారణలో భాగమంటూ సెటైర్లు వేస్తున్నారు. గతంలో ఆమె తన పెంపుడు పాములు, మొసళ్లకు మోదీని విందుగా చేస్తానంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. నాలుగు అనకొండలను, ఒక మొసలిని మోదీకి బహుమతిగా పంపిస్తానని పేర్కొంది. ఆమె పీవోకేకు చెందిన ఓ ఆర్మీ అధికారి కూతురు.