భువనగిరి చౌరస్తా వద్ద కారు-ఆర్టీసీ బస్సు ఢీ: 30 మందికి గాయాలు
- హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న బస్సు
- ప్రమాదానికి అతివేగమే కారణం
- ఐదుగురి పరిస్థితి విషమం
క్షణాల్లోనే స్పందించిన స్థానికులు బస్సులో చిక్కుకున్న వారిని రక్షించి స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. మొత్తం 30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదానికి తాత్కాలిక డ్రైవర్ అతివేగమే కారణమని తెలుస్తోంది. డ్రైవర్ కారును గమనించకుండా వేగంగా వెళ్లడం వల్లే ప్రమాదం జరిగిందని బాధితులు చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.