Kamal Haasan: ప్రభు ఇచ్చిన 'విందు అద్భుతం' అంటున్న కమల్!

  • ప్రత్యేక విందుతో తమిళ నటుడు ప్రభు సత్కారం
  • విందు విశేషాలను అభిమానులతో పంచుకున్న కమల్
  • త్వరలో భారతీయుడు-2గా ప్రేక్షకుల్లోకి

ప్రముఖ సినీ నటుడు కమలహాసన్ సినీ పరిశ్రమలోకి ప్రవేశించి 60 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా కమల్ కు ప్రత్యేక విందు ఇచ్చిన తమిళ నటుడు ప్రభు అనంతరం సత్కరించి.. ఆయనకు జ్ఞాపికను అందజేశారు. ఈ విందుతో ఉప్పొంగిపోయిన కమల్ దీనికి సంబంధించిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు.

‘నటుడు ప్రభుతో గడపడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. విందు అద్భుతం’ అని కమల్ ప్రశంసించారు. ఇక కమల్ ప్రస్తుతం భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న ‘భారతీయుడు-2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకోసం 23 సంవత్సరాల తర్వాత శంకర్ తో కలిసి కమల్ మళ్లీ పనిచేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, తదితరులు నటిస్తున్నారు.

More Telugu News