jaggareddy: వ్యూహాత్మకంగా ప్రగతి భవన్ ముట్టడికి ప్రయత్నాలు.. ఆటోలో వచ్చిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి అరెస్టు

  • పోలీసులను తప్పించుకొని వచ్చిన కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి
  • అడ్డంకులు సృష్టించినా ప్రగతి భవన్‌ వద్ద నిరసన తెలుపుతామని వ్యాఖ్య
  • న్యాయస్థాన ఆదేశాలను కూడా సర్కారు లెక్కచేయట్లేదని ఆగ్రహం

కాంగ్రెస్ నేతలు వ్యూహాత్మకంగా హైదరాబాద్ లోని ప్రగతి భవన్ కు చేరుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్, జూబ్లిహిల్స్ లోని తన నివాసం నుంచి ప్రగతి భవన్ కు బయలుదేరిన రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోలీసులను తప్పించుకొని కాంగ్రెస్ సీనియర్ నేత, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా ప్రగతి భవన్ ముట్టడికి వచ్చారు. ఇక్కడి సమీపంలోని ఓ హోటల్‌కు చేరుకుని, ఓ ఆటోలో ప్రగతి భవన్ కు బయలుదేరారు. అయితే, అంతలోనే ఆయనను పోలీసులు అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ సర్కారుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రగతి భవన్‌ వద్ద నిరసన తెలుపుతామని అన్నారు. న్యాయస్థాన ఆదేశాలను కూడా సర్కారు లెక్కచేయట్లేదన్నారు. ఈ వైఖరితో జనాల్లోకి సర్కారు తప్పుడు సంకేతాలు పంపుతోందని విమర్శించారు. రాష్ట్రంలో పోలీస్‌ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు.

More Telugu News