బాలీవుడ్ సంగీత దర్శకుల వైపే మొగ్గుచూపుతున్న చిరూ

21-10-2019 Mon 12:57
  • చిరంజీవి తదుపరి సినిమాకి సన్నాహాలు 
  • సంగీత దర్శకులుగా అజయ్ - అతుల్ 
  • వచ్చేనెలలో మొదలుకానున్న షూటింగ్

మెగా అభిమానులందరి దృష్టి ఇప్పుడు చిరంజీవి తదుపరి చిత్రంపైనే వుంది. చిరూ తదుపరి చిత్రం కొరటాల దర్శకత్వంలో రూపొందనుంది. వచ్చేనెలలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అందుకు సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. ఈ సినిమాకి సంగీత దర్శకులుగా బాలీవుడ్ సంగీత ద్వయం 'అజయ్ - అతుల్' పేర్లు వినిపిస్తున్నాయి.

సాధారణంగా కొరటాల తన సినిమాలకి దేవిశ్రీని తీసుకుంటూ ఉంటాడు. అయితే కొత్తదనం కోసం చిరూ 'అజయ్ - అతుల్' పేర్లను సూచించినట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో చరణ్ కనబరిచిన ఆసక్తే ఎక్కువని అంటున్నారు. కొరటాల కూడా అందుకు అంగీకరించి వాళ్లతో చర్చలు జరుపుతున్నారట. చరణ్ తో పాటు నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా త్రిష పేరు వినిపిస్తోంది.