NG ranga varsity: ఎన్‌జీ రంగా వర్సిటీ వీసీపై అట్రాసిటీ కేసు: అరెస్టు.. జ్యుడీషియల్ రిమాండ్‌!

  • అటెండరు ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
  • ఉద్యోగం విషయంలో ఇద్దరి మధ్య వాగ్వివాదం
  • అరెస్టు వెనుక రాజకీయ కారణాలు?

గుంటూరులోని ఆచార్య ఎన్‌జీ రంగా విశ్వవిద్యాలయం ఉపకులపతి వల్లభనేని దామోదర్‌పై పోలీసులు అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి 15 రోజుల రిమాండ్‌ విధించారు.

 వివరాల్లోకి వెళితే...చిలకలూరిపేట మండలం పురుషోత్తమపట్నం గ్రామానికి చెందిన ఉయ్యాల మురళీకృష్ణ మూడేళ్ల క్రితం వర్సిటీలో ఔట్‌సోర్సింగ్‌ విధానంలో అటెండర్‌గా చేరాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ 12న అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. గత నెల 23న సచివాలయానికి వచ్చిన మురళీకృష్ణ.. వీసీ, రిజిస్ట్రార్‌లను కలిసి తిరిగి తనను ఉద్యోగంలోకి తీసుకోవాలని కోరాడు.

ఈ సందర్భంగా ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. అయితే తన పట్ల వీసీ అనుచితంగా వ్యవహరించారని, అంతు చూస్తానని బెదిరించారని, కులం పేరుతో దూషించారని ఆరోపిస్తూ మురళీకృష్ణ మరునాడు అంటే గతనెల 24న పోలీసులకు ఫిర్యాదు చేశాడు.  సీసీ టీవీ పుటేజీ పరిశీలించిన  అనంతరం ఎస్సీ, ఎస్టీ నిరోధక చట్టంలోని సెక్షన్‌ 3(1,2)తోపాటు ఐపీసీ 506 కింద వీసీని అరెస్ట్‌ చేసి మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచగా, జ్యుడీషియల్ రిమాండుకు ఆదేశించారు. 

More Telugu News