బెజవాడ దుర్గగుడిలో మరో వివాదం... చీరల విభాగంలో ఉద్యోగి చేతివాటం!

20-10-2019 Sun 22:03
  • భక్తులు సమర్పించిన చీరలు మాయం
  • ఖరీదైన చీరల స్థానంలో వేరే చీరలు
  • రూ.11.6 లక్షల మేర గోల్ మాల్

విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో మరో వివాదం తెరపైకి వచ్చింది. దుర్గ గుడి చీరల విభాగంలో జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యం చేతివాటం ప్రదర్శించినట్టు గుర్తించారు. అమ్మవారికి భక్తులు సమర్పించే ఖరీదైన చీరలను మాయం చేసి వాటి స్థానంలో వేరే చీరలను పెట్టినట్టు తెలుసుకున్నారు. దాదాపు రూ.11.6 లక్షల మేర చీరల్లో గోల్ మాల్ జరిగినట్టు అధికారులు అంచనా వేశారు. జూనియర్ అసిస్టెంట్ సుబ్రహ్మణ్యంపై దుర్గ గుడి ఈవో సురేశ్ బాబు చర్యలు తీసుకోనున్నట్టు తెలుస్తోంది. గతంలో దుర్గ గుడి ఈవోగా పనిచేసిన కోటేశ్వరమ్మ వద్ద సుబ్రహ్మణ్యం సీసీగా పనిచేశాడు.