ఈఎస్ఐ స్కామ్ నిందితురాలు పద్మ ఆరోగ్య పరిస్థితి మరింత విషమం!

20-10-2019 Sun 10:43
  • ఈఎస్‌ఐ ఆసుపత్రి ఔషధాల కుంభకోణం కేసులో నిందితురాలిగా పద్మ
  • చంచల్ గూడ జైలులో ఆత్మహత్యాయత్నం
  • ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స

తెలంగాణలో తీవ్ర కలకలం రేపిన ఈఎస్‌ఐ ఆసుపత్రి ఔషధాల కుంభకోణం కేసులో నిందితురాలు పద్మ ఆరోగ్య పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్టు ఉస్మానియా వైద్యులు తెలిపారు. ఈఎస్‌ఐ సంయుక్త సంచాలకురాలిగా ఉన్న ఆమెను, ఇటీవల వెలుగులోకి వచ్చిన ఔషధాల కొనుగోలు కుంభకోణం కేసులో ఏసీబీ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆమెను చంచల్ గూడ జైలుకు రిమాండ్ ఖైదీగా తరలించగా, నిన్న సాయంత్రం చికిత్స కోసం ఇచ్చిన మాత్రలను పెద్ద మోతాదులో తీసుకుందన్న సంగతి తెలిసిందే. ఆమెను జైలు సిబ్బంది వెంటనే ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. ఆమెను ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్సను అందిస్తున్నామని, పద్మ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడాల్సి వుందని వైద్యులు తెలిపారు.