Maharashtra: ఎన్నికల వేళ మహారాష్ట్రలో బాంబు పేలుడు.. ట్రక్కు డ్రైవర్‌ దుర్మరణం

  • పేలిన వాహనంలో అమర్చిన బాంబు
  • డ్రైవర్‌ స్నేహితుడికి తీవ్రగాయాలు
  • కొల్హాపూర్‌ పట్టణంలో ఘటన
మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ పట్టణంలో ఈరోజు బాంబు పేలుడు సంభవించింది. ఓ ట్రక్కులో గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన బాంబు పేలడంతో ట్రక్కు డ్రైవర్‌ అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పక్షాలు ప్రచారంతో బిజీగా ఉన్న సమయంలో జరిగిన ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.

వివరాల్లోకి వెళితే...ఓ ట్రక్కు డ్రైవర్‌ తన స్నేహితుడితో కలిసి వాహనంలో వచ్చి బండిని రోడ్డు పక్కన ఆపాడు. ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగానే భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. దీంతో డ్రైవర్‌ అక్కడికక్కడే చనిపోగా, తీవ్రంగా గాయపడిన అతని స్నేహితుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిని బాంబు డిస్పోజల్‌ స్వ్కాడ్‌ తనిఖీ చేసింది. క్షతగాత్రుడిని జరిగిన సంఘటనపై ప్రశ్నిస్తోంది.
Maharashtra
kolhapur
bomb explosen
one died

More Telugu News