BJP: కేంద్ర నిధులను ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉంది: బీజేపీ నేత సునీల్ దేవధర్

  • తిరుపతిలో గాంధీ సంకల్ప యాత్రను ప్రారంభించిన సునీల్ దేవధర్
  • కేంద్రం ఏపీకి రూ. వెయ్యి కోట్లు కేటాయించింది
  • వచ్చే ఎన్నికల్లో ఏపీ నుంచి బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుంది
జలశక్తి అభియాన్ ద్వారా కేంద్రం ఏపీకి రూ. వెయ్యి కోట్లు కేటాయించిందని బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవధర్ అన్నారు. తిరుపతిలో గాంధీ సంకల్ప యాత్రను ఈరోజు ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వ నిధులను ప్రజలకు చేర్చాల్సిన బాధ్యత సీఎం జగన్ పై ఉందని అన్నారు.

ఇక వచ్చే ఎన్నికల గురించి ఆయన ప్రస్తావిస్తూ, ఏపీలో బీజేపీ ప్రయాణం సజావుగా సాగుతోందని, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, పంచాయితీ సహా ఏపీలో జరిగే అన్ని ఎన్నికల్లోనూ బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఏపీలో 48 వేలకు పైగా బూత్ కమిటీల్లో ప్రస్తుతం 11 వేల బూత్ కమిటీలు పూర్తయ్యాయని చెప్పడం సంతోషంగా ఉందని అన్నారు.
BJP
sunil devdhar
Andhra Pradesh
cm
jagan

More Telugu News