నిర్మాత రమేశ్ ప్రసాద్ కు చిరంజీవి ప్రగాఢ సానుభూతి

18-10-2019 Fri 14:12
  • ప్రసాద్ గ్రూప్ అధినేత రమేశ్ ప్రసాద్ కు భార్యావియోగం
  • గుండెపోటుతో మరణించిన ప్రసాద్ అర్ధాంగి విజయలక్ష్మి
  • రమేశ్ ప్రసాద్ కు చిరంజీవి పరామర్శ

ప్రముఖ నిర్మాత, ప్రసాద్ గ్రూప్ సంస్థల అధినేత అక్కినేని రమేశ్ ప్రసాద్ కు భార్యావియోగం కలిగిన సంగతి తెలిసిందే. ఆయన భార్య విజయలక్ష్మి గుండెపోటుతో మరణించారు. ఈ నేపథ్యంలో రమేశ్ ప్రసాద్ ను అగ్రనటుడు చిరంజీవి పరామర్శించారు. ఇవాళ రమేశ్ ప్రసాద్ నివాసానికి వెళ్లిన చిరంజీవి ఓదార్పు వచనాలు పలికారు. విజయలక్ష్మి చిత్రపటానికి నివాళులు అర్పించారు. రమేశ్ ప్రసాద్ కు, ఆయన కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా ప్రగాఢ సంతాపం తెలియజేశారు.