టమాటాలలా కనిపించే కశ్మీర్ పళ్లు... రూ. 100కు నాలుగట!

18-10-2019 Fri 11:45
  • నిజామాబాద్ కు వచ్చిన కశ్మీర్ ఫ్రూట్స్
  • టమాటాల మాదిరే కనిపించే స్వీట్ ఓమర్
  • ఆసక్తిగా తిలకించిన ప్రజలు

తోపుడు బండిపై పెట్టి అమ్ముతున్న ఈ పండ్లను చూడండి. అచ్చం టమాటాల్లాగా ఉన్నాయి అనుకుంటారు ఎవరైనా. కానీ వీటి ధర మాత్రం ఆకాశంలో ఉంది. రూ. 100కు నాలుగే నాలుగట. వీటి స్పెషల్ ఏంటని అనుకుంటున్నారా? ఇవి టమాటాల మాదిరిగానే కనిపిస్తాయి. కానీ, వీటి పేరు స్వీట్ ఓమర్ పండ్లు. కశ్మీర్ నుంచి దిగుమతి అవుతుంటాయి. నిజామాబాద్ ప్రాంతానికి స్వీట్ ఓమర్ లోడ్ రాగా, ఫ్రూట్ మార్కెట్ వ్యాపారులు, వీటిని తోపుడు బండ్లపై పెట్టి వీధుల్లో తిరుగుతూ విక్రయించారు. ఇక ఇవి టమాటాల మాదిరిగా ఉండటంతో ప్రజలు కూడా వీటిని ఆసక్తిగా తిలకించారు. అన్నట్టు ఇవి ఎప్పుడు పడితే అప్పుడు లభించవు. కొన్ని ప్రత్యేక సీజన్ లలో మాత్రమే వస్తుంటాయట.