Chandrababu: చంద్రబాబు మానసిక సమతుల్యతను కోల్పోయారు: సాయిరెడ్డి

  • లోకేశ్ రాజకీయ వారసుడిగా ఎదుగుతాడని చంద్రబాబు ఆశించారు
  • కానీ, లోకేశ్ విఫలమయ్యాడు
  • దీంతో చంద్రబాబు మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారు
టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి విమర్శలు గుప్పించారు. చంద్రబాబు మానసిక సమతుల్యాన్ని కోల్పోయారని అన్నారు. కుమారుడు నారా లోకేశ్ తన రాజకీయ వారసుడిగా ఎదుగుతాడని చంద్రబాబు ఆశించారని... కానీ, లోకేశ్ విఫలం చెందడంతో ఆయన మెంటల్ బ్యాలెన్స్ కోల్పోయారని చెప్పారు. మహిళలు, గ్రామ వాలంటీర్లపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు కూడా దీనికి నిదర్శనమని ట్వీట్ చేశారు.
Chandrababu
Nara Lokesh
Vijayasai Reddy
Telugudesam
YSRCP

More Telugu News