ఈ నెల 19 నుంచి హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్ల నిరవధిక సమ్మె

18-10-2019 Fri 10:28
  • సమ్మెలో పాల్గొననున్న ఓలా, ఉబెర్, ఇతర క్యాబ్ డ్రైవర్లు
  • కి.మీ.కు కనీస రుసుమును రూ. 22 చేయాలని డిమాండ్
  • డ్రైవర్లకు కనీస వ్యాపార హామీ ఇవ్వాలని విన్నపం

హైదరాబాదులోని క్యాబ్ డ్రైవర్లు ఈనెల 19 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నారు. ఈ సమ్మెలో ఓలా, ఉబెర్, ఐటీ కంపెనీలకు సేవలందిస్తున్న ఇతర క్యాబ్ డ్రైవర్లు పాల్గొనబోతున్నారని తెలంగాణ ట్యాక్సీ, డ్రైవర్స్ జేఏసీ ఛైర్మన్ షేక్ సలావుద్దీన్ తెలిపారు. కిలోమీటరుకు కనీస రుసుమును రూ. 22 చేయాలనే డిమాండ్ తో సమ్మెను చేపట్టబోతున్నట్టు చెప్పారు. డ్రైవర్లకు కనీస వ్యాపార హామీని ఇవ్వాలని... ఐటీ కంపెనీలకు అనుసంధానంగా పని చేస్తున్నవారికి జీవో నెంబర్ 61,66 అమలు చేయాలని డిమాండ్ చేశారు. ట్యాక్సీ డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు. డ్రైవర్లపై జరుగుతున్న దాడుల కేసులను పరిష్కరించేందుకు వినియోగదారుల కేవైసీని తప్పనిసరి చేయాలని డిమాండ్ చేశారు.