వృద్ధ దంపతులను చంపి నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లిన దొంగలు

  • బెంగళూరులో దారుణం
  • ఇంట్లోకి ప్రవేశించి భార్యాభర్తలను చంపేసిన దొంగలు
  • హంతకుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన పోలీసులు
బెంగళూరులో దారుణం జరిగింది. వృద్ధ దంపతులను హత్య చేసిన దుండగులు నగలు, నగదు దోచుకుని పరారయ్యారు. గరుడాచార్య పాళ్య ఆర్‌హెచ్‌బీ కాలనీలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. కాలనీకి చెందిన చంద్రేగౌడ (63), లక్ష్మమ్మ (55) భార్యా భర్తలు. వీరికి సంతానం లేకపోవడంతో ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నారు. ఇటీవల ఆమెకు పెళ్లి చేసి అత్తారింటికి పంపించారు. అప్పటి నుంచి ఇంట్లో వీరిద్దరే ఉంటున్నారు. బుధవారం రాత్రి తలుపులు బద్దలుగొట్టి ఇంట్లోకి ప్రవేశించిన దొంగలు వారిని హత్య చేసి ఇంట్లోని నగదు, ఆభరణాలు ఎత్తుకెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
Go Back to Shorts
Karnataka
bengaluru
murder

More Telugu News