హెల్మెట్ ధరించలేదట.. ట్రాక్టర్ డ్రైవర్‌కు జరిమానా!

18-10-2019 Fri 07:35
  • ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ పోలీసుల నిర్వాకం
  • వాటిని తీసుకెళ్లి ఉన్నతాధికారులకు చూపించిన బాధితుడు
  • చలాన్ రద్దు చేసిన అధికారులు

హెల్మెట్ ధరించకుండా ట్రాక్టర్ నడిపినందుకు జరిమానా చెల్లించాలంటూ ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు ఉత్తరప్రదేశ్ ట్రాఫిక్ పోలీసులు నోటీసులు పంపారు. అది చూసి విస్తుపోవడం బాధితుడి వంతైంది. గఢ్‌ముక్తేశ్వర్‌కు చెందిన ఓ ట్రాక్టర్ డ్రైవర్‌కు ట్రాఫిక్ పోలీసులు పంపిన నోటీసులు ట్రాఫిక్ పోలీసుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. హెల్మెట్ లేకుండా ట్రాక్టర్ నడపడంతోపాటు, డ్రైవింగ్ లైసెన్స్ కూడా దగ్గర లేనందుకు ఈ-చలాన్ విధించినట్టు నోటీసులు పంపారు. అది చూసిన బాధిత డ్రైవర్ విస్తుపోయాడు. వాటిని తీసుకుని నేరుగా అధికారులను సంప్రదించాడు. పరిశీలించిన అధికారులు కంప్యూటర్ నమోదులో లోపం కారణంగా అలా జరిగిందని పేర్కొంటూ చలాన్ రద్దు చేశారు.