Jana Sena: జనసేనకు గుడ్ బై చెప్పి జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన రాజోలు మాజీ ఎమ్మెల్యే కృష్ణంరాజు

  • జనసేనకు గట్టి దెబ్బ
  • క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని భావిస్తున్న పవన్
  • వైసీపీ తీర్థం పుచ్చుకున్న అల్లూరి కృష్ణంరాజు
పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి మరో గట్టి దెబ్బ తగిలింది. మాజీ ఎమ్మెల్యే అల్లూరి కృష్ణంరాజు జనసేనకు వీడ్కోలు పలికారు. జగన్ సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అల్లూరి కృష్ణంరాజు గతంలో రాజోలు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే ఎన్నికల్లో రాజోలు స్థానాన్ని ఎస్సీలకు రిజర్వ్ చేయడంతో అక్కడ్నించి రాపాక వరప్రసాద్ పోటీ చేసి విజయం సాధించారు.

కొన్నాళ్లుగా అల్లూరి కృష్ణంరాజు పార్టీ మారతారని ఊహాగానాలు గట్టిగానే వినిపించాయి. వ్యాపార రంగంలో ఉన్న ఆయనకు స్థానికంగా మంచి పట్టు ఉంది. క్షేత్రస్థాయిలో జనసేన పార్టీని బలోపేతం చేయాలని ప్రణాళికలు రచిస్తున్న పవన్ కల్యాణ్ కు మాజీ ఎమ్మెల్యే నిష్క్రమణ నిరాశ కలిగించే విషయమని చెప్పాలి.
Jana Sena
Jagan
YSRCP
Alluri Krishnamraju

More Telugu News