Manish Tiwari: సావర్కర్ కి బదులు నాథూరామ్ గాడ్సేకు భారతరత్న ఇవ్వాలి: కాంగ్రెస్ నేత మనీష్ తివారీ ఎద్దేవా

  • ఇప్పుడు వీర్ సావర్కర్ కిస్తారు
  • మళ్లీ గాడ్సేకు కూడా ఇస్తామంటారు
  • బీజేపీ మేనిఫెస్టోపై కాంగ్రెస్ నేత ఆగ్రహం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్డీఏ, కాంగ్రెస్ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తాజాగా బీజేపీ తన మహరాష్ట్ర మేనిఫెస్టోలో జ్యోతిరావ్ పూలే, సావిత్రిబాయ్ పూలే, వీర్ సావర్కర్ ల పేర్లను భారతరత్నకు ప్రతిపాదిస్తామని పేర్కొనటంతో.. కాంగ్రెస్ నేతలు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.

మహాత్మాగాంధీ హత్యకు పథక రచన చేసిన వీర్ సావర్కర్ కు భారత రత్న ఇవ్వడమేమిటంటూ కాంగ్రెస్ నేత మనీష్ తివారీ విమర్శించారు. అతనికి బదులుగా గాంధీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సేకు భారత రత్న ఇవ్వండని ఎద్దేవా చేశారు. ‘ఇప్పుడు వీర్ సావర్కర్ కు ఇస్తామంటున్నారు. అదే క్రమంలో గాడ్సేకు కూడా  ఇస్తారు. గాంధీ 150వ జయంతి జరుపుకుంటున్న ఈ సంవత్సరంలో ఎన్డీఏ నేరుగా గాడ్సేకు ఈ అత్యున్నత పౌర పురస్కారం అందించాలి’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Manish Tiwari
Congress
Savarkar
Nathuram Godse

More Telugu News