KCR: హెలికాప్టర్ కు అనుమతి ఇవ్వని అధికారులు.. కేసీఆర్ సభ రద్దు

  • కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దు
  • సభకు ఆటంకంగా మారిన భారీ వర్షం
  • అధికారుల సూచనతో కార్యక్రమాన్ని రద్దు చేసుకున్న సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ సభ రద్దైంది. భారీ వర్షం కారణంగా సభను రద్దు చేశారు. ప్రతికూల వాతావరణం నేపథ్యంలో కేసీఆర్ హెలికాప్టర్ కు ఏవియేషన్ అధికారులు అనుమతి ఇవ్వలేదు. అధికారుల సూచనతో కేసీఆర్ తన సభను రద్దు చేసుకున్నారు. సీఎం రావడం లేదనే ప్రకటనతో సభా ప్రాంగణానికి భారీగా చేరుకున్న నాయకులు, ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు.
KCR
Huzurnagar
TRS

More Telugu News