Bitthiri satthi: 'తుపాకి రాముడు'గా బిత్తిరి సత్తి .. ప్రీ రిలీజ్ ఈవెంట్ తేదీ ఖరారు

  • బుల్లితెరపై బిత్తిరి సత్తికి క్రేజ్ 
  • 'తుపాకి రాముడు' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సన్నాహకాలు 
  • ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల
బుల్లితెరపై బిత్తిరి సత్తి తనదైన డైలాగ్ డెలివరీతో, మేనరిజంతో సందడి చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటాడు. అలా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆయన సినిమాల్లోనూ అడపా దడపా వేషాలు వేస్తూ వస్తున్నాడు. అలాంటి బిత్తిరి సత్తి .. త్వరలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు.

ఆయన హీరోగా ప్రభాకర్ దర్శకత్వంలో 'తుపాకి రాముడు' రూపొందింది. రసమయి బాలకిషన్ నిర్మించిన ఈ సినిమాను, ఈ నెల 25వ తేదీన విడుదల చేయనున్నారు. ఈలోగా ఈ నెల 20వ తేదీన ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఆ రోజు సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది.
Bitthiri satthi

More Telugu News