Jagan: చేనేతకు చేయూత.. మరో కొత్త పథకానికి ఆమోదముద్ర వేసిన ఏపీ కేబినెట్

  • వైయస్సార్ చేనేత హస్తం పథకానికి ఆమోదం
  • చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ. 24 వేల ఆర్థికసాయం
  • 90 వేల కుటుంబాలకు చేకూరనున్న లబ్ధి

అమరావతిలో ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా మరో కొత్త పథకానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ. 24 వేల ఆర్థిక సాయాన్ని 'వైయస్సార్ చేనేత హస్తం' పేరుతో అందించాలనే నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించింది. ఈ మొత్తాన్ని ఒకే విడతలో అందించాలని నిర్ణయించారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని 90 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ఈ పథకానికి ఏడాదికి రూ. 216 కోట్ల మేర ఖర్చవుతుందని అంచనా వేశారు.

More Telugu News