వచ్చేనెలకి సిద్ధమవుతున్న 'తెనాలి రామకృష్ణ'

16-10-2019 Wed 09:19
  • హాస్యప్రధానంగా సాగే 'తెనాలి రామకృష్ణ  BA. BL'
  • లాయర్ పాత్రలో కనిపించనున్న సందీప్ కిషన్ 
  • నవంబర్లో ప్రేక్షకుల ముందుకు  

మొదటి నుంచి కూడా సందీప్ కిషన్ వైవిధ్యభరితమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. 'నిను వీడని నీడను నేనే' సినిమాతో ఆశించిన ఫలితాన్నే అందుకున్న ఆయన, తాజా చిత్రంగా 'తెనాలి రామకృష్ణ BA. BL' రూపొందింది. హాస్యభరితమైన కథలను జనరంజకంగా తెరకెక్కించగల జి.నాగేశ్వరరెడ్డి ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న ఈ సినిమాను వచ్చేనెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు. 'తెనాలి రామకృష్ణ' అనగానే ఆయన చేసిన హాస్య విన్యాసాలు గుర్తుకువస్తాయి. అలాగే  ఈ సినిమా అంతా కూడా పూర్తి వినోదభరితంగానే సాగుతుందని అంటున్నారు. హన్సిక కథానాయికగా నటించిన ఈ సినిమాలో, పోసాని .. మురళీశర్మ .. వెన్నెల కిషోర్ .. సప్తగిరి .. చమ్మక్ చంద్ర .. ప్రభాస్ శ్రీను ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.