saurav ganguly: గంగూలీ కాషాయ కండువా కప్పుకోబోతున్నాడంటూ ప్రచారం!

  • 2021లో బెంగాల్ సీఎం అభ్యర్థిగా గంగూలీ 
  • అమిత్‌షాతో జరిగిన సమావేశంలో చర్చ
  • తోసిపుచ్చిన గంగూలీ
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి, బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ త్వరలో బీజేపీలో చేరబోతున్నట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ నెల 12న కేంద్ర మంత్రి అమిత్‌షాను గంగూలీ కలిసినప్పటి నుంచి ఈ ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2021లో పశ్చిమ బెంగాల్‌లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గంగూలీ బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నాడని,  అందులో భాగంగానే ఇప్పుడు బీసీసీఐ అధ్యక్ష పదవిని గంగూలీకి ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది. ఊహాగానాలు తారస్థాయికి చేరడంతో గంగూలీ స్పందించాడు. ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన లేదంటూ ఆ ప్రచారాన్ని తోసిపుచ్చాడు. అమిత్‌ షాతో జరిగిన భేటీలో రాజకీయ అంశాలు చర్చకు రాలేదని స్పష్టం చేశాడు.
saurav ganguly
BJP
West Bengal
bcci

More Telugu News