Srikakulam District: పుట్టగొడుగుల కోసం టీడీపీ-వైసీపీ వర్గాల మధ్య గొడవ.. వైసీపీ కార్యకర్త హత్య!

  • శ్రీకాకుళం జిల్లా కుంటిభద్రలో ఘటన
  • పుట్టగొడుల కోసం ఇరు వర్గాల మధ్య ఘర్షణ
  • గ్రామంలో ఉద్రిక్తత.. భారీగా మోహరించిన పోలీసులు
పుట్టగొడుగుల కోసం ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో వైసీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలోని కుంటిభద్రలో జరిగిందీ ఘటన. పుట్టగొడుగుల విషయంలో గ్రామానికి చెందిన రెండు వర్గాల మధ్య ఘర్షణ రేకెత్తింది. అది కాస్తా తీవ్ర రూపం దాల్చడంతో ఇరు వర్గాలు బల్లేలు, కర్రలతో పరస్పరం దాడికి దిగాయి. ఈ క్రమంలో  కొవ్వాడ యర్రయ్య అనే వ్యక్తి హిమగిరి, కామక జంగంలపై బల్లెంతో దాడిచేశాడు. దాడిలో జంగం తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో వెంటనే అతడిని పాలకొండ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు.

జంగం ఇటీవలే టీడీపీని వీడి వైసీపీలో చేరినట్టు గ్రామస్థులు చెబుతున్నారు. అతడిపై దాడిచేసింది టీడీపీ వర్గీయులేనన్న ప్రచారం జరగడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో అప్రమత్తమైన పోలీసులు గ్రామంలో 144 సెక్షన్ విధించి భారీగా బలగాలను మోహరించారు.
Srikakulam District
kunti bhadra
YSRCP
Telugudesam

More Telugu News