ap7am logo

పిక్సెల్ 4 సిరీస్ గూగుల్ మొబైల్ ఇదిగో!

Mon, Oct 14, 2019, 10:39 PM
  • అత్యాధునిక ఫీచర్లతో పిక్సెల్ 4 సిరీస్ ఫోన్లు
  • మంగళవారం న్యూయార్క్ లో లాంచింగ్ వేడుక
  • ఐ ఫోన్ 11 కంటే మించిన ధర?
ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సెర్చింజన్ దిగ్గజం గూగుల్ సంస్థ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్లో కూడా తనదైన శైలిలో ముందుకు దూసుకుపోతోంది. తాజాగా పిక్సెల్ 4 సిరీస్ లో భాగంగా పిక్సెల్ 4, పిక్సెల్ 4 ఎక్స్ఎల్ ను లాంచ్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంది. మంగళవారం న్యూయార్క్ లో దీనికోసం భారీ హార్డ్ వేర్  ఈవెంట్ ను నిర్వహించనుంది. పిక్సెల్ 4 కు సంబంధించి ఫీచర్లను గూగుల్ కొన్నింటిని బహిర్గత పర్చగా.. మరికొన్ని వివరాలు అనధికారికంగా వెల్లడయ్యాయి.

ఈ మొబైల్స్ ధరలు ఇంకా ప్రకటించలేదు. ఐ ఫోన్ 11 కంటే ఎక్కువ ధర ఉండే అవకాశం ఉంది. పిక్సెల్ 4 సిరీస్ లో మరొక వేరియంట్ ‘ ఆరెంజ్’ ను కూడా మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. పిక్సెల్ 4 సిరీస్ మొబైల్స్ లో 'సోలి' అనే మోషన్ సెన్సింగ్ రాడార్  ఫీచర్ ఉంది. దీనిపై గూగుల్ ఇప్పటికే వీడియోను కూడా విడుదల చేసింది.  సైగల ద్వారా ఫోన్ ను నియంత్రించడం ఈ ఫోన్ ప్రత్యేకత.
X

Feedback Form

I agree to Terms of Service & Privacy Policy
Do you hate Fake News, Misleading Titles, Cooked up Stories and Cheap Analyses?...
We are here for YOU: Team ap7am.com
GarudaVega Banner Ad
Latest Video News..
Advertisement